Wednesday 4 January 2017

No One Killed Pravallika - Part 2

ఫ్రెండ్స్ మాత్రం ప్రవల్లిక అసలు కాలేజీ కె రాలేదు అని చెపుతారు, దీంతో కంగారు పద సుభ్రమణ్యం ప్రవల్లిక వెతకడానికి కాలేజీ కి వెళ్తాడు ప్రవల్లిక రోజు వెళ్లే దారి లో నే వెళ్తాడు కానీ ఆచూకీ తెలియదు ....

ప్రవల్లిక బెస్ట్ ఫ్రెండ్ పూజిత ఇంటికి వెళ్తాడు సుబ్రహ్మణ్యం

సుబ్రహ్మణ్యం : "అమ్మ పూజిత ప్రవల్లిక ఇంకా ఇంటికి రాలేదు నిను ఏమైనా కలిసింది" కంగారుగా అడుగుతాడు సుబ్రహ్మణ్యం
పూజిత : "ఆదేంటి అంకుల్ తన్ను కాలేజీ కి వెళ్లలేదా"
సుబ్రహ్మణ్యం : "అదిఎంటి అమ్మ నువ్వు తాను కలిసే కదా వెళ్లారు"
పూజిత : " రోజు నేను కాలేజీ కి వెళ్ళలేదు అంకుల్, నాకు కొంచం తల నొప్పిగా ఉంటేను కాలేజీ కి వెళ్ళలేదు, అయినా మీరు ఒక సరి కాలేజీ లో కనుకున్నారా"
సుబ్రహ్మణ్యం : "ప్రవల్లిక కాలేజీ కి  రాలేదు అని చెప్పారు అమ్మ"
పూజిత : "బహుశా తన ఎక్కడికైనా వెళ్ళింది ఏమో అంకుల్, చాల మంది ఫ్రెండ్స్ ఉన్నారు తనకి వాళ్ళని ఒక సరి కనుకుంటాను"
సుబ్రహ్మణ్యం : "అలాగే నేను కూడా ఒక సరి నా బంధువులని అడుగుతాను బహుశా అక్కడికి కానీ వెళ్ళింది ఏమో"
పూజిత : "అలాగే అంకుల్, కంగారు పడకండి అంకుల్ ఎక్కడికి వెలిఉండదు, తనకి ఏమి కాదు"

పూజిత ఇంటినుండి బయలుదేరిన సుబ్రహ్మణ్యం తన బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి కనుకుంటాడు, అందరూ తెలియదు ఇక్కడికి రాలేదు అని చెపుతారు. అప్పటికి రాత్రి 10 అవుతుంది వెంటనే దగరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు కంప్లైన్ చేయడానికి.


సుబ్రహ్మణ్యం : "సార్ సార్ ! నా కూతురు కనపదం లేదు సార్" కంగారుపడుతూ ఎస్. దగరకు వెళ్తాడు
ఎస్ : "ఏంటి అయ్యా ఆలా అరుస్తావ్ విషయం సరిగా చూపు"
సుబ్రహ్మణ్యం : "సార్ నా కూతురు కనపట్లేదు సార్ ఉదయం కాలేజీ కి వెళ్ళింది తిరిగి ఇంటికి రాలేదు సార్"
ఎస్ : "ఫ్రెండ్స్ ఇంటికి కాల్ చేసి కనుకున్నారా, కాలేజీ లో అడిగారా తాను ఎపుడు కాలేజీ నుండి బయలుదేరిందో"
సుబ్రహ్మణ్యం : "సార్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదు, అసలు కాలేజీ కె వెళ్ళలేదు సార్, కాలేజీ వాళ్ళు తన ని అసలు రోజు క్లాస్ చూడలేదు అని చెప్పారు"
ఎస్ : "సరే తన పేరు మిగతా డీటెయిల్స్ ఇవండీ"
సుబ్రహ్మణ్యం తన కూతురు పూర్తీ డీటెయిల్స్ ఇస్తాడు, దీంతో పోలీసులు కేసు నమోదు చేస్తారు ..

తర్వాతి రోజు సుబ్రహ్మణ్యం ఇంటికి పోలీసులు వస్తారు, అప్పటికే చుటుపకాల వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరు అక్కడే ఉంటారు
పోలీసులు కేసు ని కూడా ఒక సాదా సిద కేసు లనే తీసుకుంటారు తమ ఫార్మాలిటీస్ పూర్తీ చేసి వెళ్తారు ...
సుబ్రహ్మణ్యం మాత్రం తన ప్రయత్నాలు తాను చేసుకుంటాడు కానీ ప్రవల్లిక ఆచూకీ తెలియదు ..

సుబ్రహ్మణ్యం స్నేహితుడు ఒకడు ప్రవల్లిక ని వెతకడానికి మీడియా హెల్ప్ తీసుకోమంటాడు, మీడియా ద్వారా వెళ్తే కేసు మీద పోలీసులు సీరియస్ తీసుకుంటారు గవర్నమెంట్ కి కూడా విషయం అర్థం అవుతుంది..


దింతో వెంటనే విషయాన్ని మీడియా చెపుతాడు సుబ్రహ్మణ్యం.. మీడియా తమ ఛానల్స్ లో ప్రవల్లిక గురించి న్యూస్ వేస్తారు .. దింతో కేసు మీద అందరికి ఇంటరెస్టింగ్ వస్తుంది, ప్రవల్లిక కనపడకుండా పోయిన రెండు రోజులు తర్వాత కేసు గురించి రాష్ట్రమంతా చేర్చ జరుగుతుంది, ప్రతి న్యూస్ ఛానల్ ప్రవల్లిక గురించి చూపిస్తారు .. దింతో పోలీసులు మీద వత్తిడి వస్తుంది .. కమిషనేర్ కి కేసు అప్పచెపుతుంది గవర్నమెంట్ .....


తరవాత ఏమైంది ....

No One Killed Pravallika - Part 1

అందరికి నమస్కారం .... ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ ... ముందుగా కథ లో ని పాత్రలు పరిచయం


ప్రవల్లిక, సుభ్రమణ్యం (ప్రవల్లిక తండ్రి), సరస్వతి (ప్రవల్లిక తల్లి), విక్రమ్ కుమార్ (రిపోర్టర్), విష్ణు నాయక్ (కేసు విచారించే పోలీస్), పూజిత (ప్రవల్లిక ఫ్రెండ్), ఇంకొన్ని పాత్రలు కథ మధ్య లో వస్తాయ్ ...

సుభ్రమణ్యం ఒక చిన్న వ్యాపారవేత్త ఆతని భార్య సరస్వతి హౌస్ వైఫ్, వీళ్ళకి ఒక కూతురు పేరు ప్రవల్లిక (17 సవత్సరాలు) ఇంటర్ చదువుతుంది.. సుభ్రమణ్యం చాల వ్యాపారాలలో డబ్బు పేటి నష్టపోయాడు అయినా సరే ఎపుడు ఎదో ఒక వ్యాపారం చేయడానికి ఉన్న ఆస్తి మొత్తం ఖర్చు చేసుతుంటాడు.. కుటుంబాసభ్యులు మాత్రం సుభ్రమణ్యం అతని కుటుంబానికి దూరంగా ఉంటారు .. సుభ్రమణ్యం కి ముగ్గురు చెల్లలు (విల పరిచయం కథ మధ్యలో చేస్తాను)..

ఎదో విధంగా తన కుటుంబాన్ని నడుపుతుంటాడు సుభ్రమణ్యం .. ప్రవల్లిక మాత్రం తన తండ్రి ప్రస్థితి, కష్టాలు చూసి బాగా చదివి మార్కులు తెచ్చుకొని తలితండ్రులని గర్వ పడేలా చేస్తుంది ...

ప్రతి రోజు RTC బస్సు లో కాలేజీ కి వెళ్లే ప్రవల్లిక రోజు సాయంత్రం 5 గంటలకు వస్తుంది .. కానీ ఒక రోజు కాలేజీ కి వెళ్లిన ప్రవల్లిక 7 దాటినా ఇంటికి చేరుకోదు .. కంగారుపడా తలితండ్రులు ఫ్రెండ్స్ ఇంటికి, తెలిసిన వాళ్ళ ఇంటికి కాల్ చేసి కనుకుంటారు, కాలేజీ కూడా కాల్ చేస్తారు కానీ ఎవరు లిఫ్ట్ చేయరు ... సుభ్రమణ్యం వెంటనే ప్రవల్లిక ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాడు తన కూతురు వచ్చిందా అని కనుకోవ దానికి .. ఫ్రెండ్స్ మాత్రం ప్రవల్లిక అసలు కాలేజీ కె రాలేదు అని చెపుతారు, దీంతో కంగారు పద సుభ్రమణ్యం ప్రవల్లిక వెతకడానికి కాలేజీ కి వెళ్తాడు ప్రవల్లిక రోజు వెళ్లే దారి లో నే వెళ్తాడు కానీ ఆచూకీ తెలియదు ....

ప్రవల్లిక బెస్ట్ ఫ్రెండ్ పూజిత కూడా ప్రవల్లిక అసలు చూడలేదు అని చెపుతుంది ..


తర్వాత ఏమైంది ... చుడండి తర్వాతి భాగం లో

ఇది ఒక త్రిల్లింగ్ స్టోరీ

ఇది ఒక త్రిల్లింగ్ స్టోరీ ...

18 సవత్సరాలు నిండడానికి సరిగా 10 రోజులు ఉండగా ఒక అమ్మాయిని చంపేస్తారు... తలితండ్రులు ఇచ్చిన కంప్లైన్ ప్రకారం కేసు ఇన్విస్టిగేషన్ చేస్తారు పోలీసులు, అనుమానం ఉన్న ప్రతిఒక్కరిని విచారిస్తారు పోలీసులు .. మరోపక్క తలితండ్రులు మీడియా స్టూడెంట్స్ పొలిటిషన్స్ సపోర్ట్ తో తన కూతురు చావుకు కారణం అయినా వాళ్ళను శిక్ష పడాలి అని డిమాండ్ చేస్తుంటారు, సరిగా మర్డర్ జరిగిన 6 రోజులు తరువాత మర్డర్ చేసింది ఇతనే అని ఒకవేక్తిని మీడియా ముందు తీసుకొని వస్తారు పోలీసులు, మీడియా కూడా ఆతని చంపాడు అని నమ్ముతుంది కానీ ఒక రిపోర్టర్ మాత్రం కేసు లో ఎదో పోలీసులు మీడియా ఒక కీలకమైన విషయాన్ని వదిలేస్తున్నారు అని అనుకుంటాడు, దింతో వెంటనే కేసు గురించి ఒక ఆర్టికల్ రాయడానికి సిద్ధమౌతాడు, కానీ పోలీసులు మీడియా ముందు తీసుకొని వచ్చిన ఆతను హంతకుడు కాదు అని తెలుస్తుది ....
కేసు ని స్టడీ చేస్తున్నపుడు రిపోర్టర్ ఓకే విషయం అర్ధం అవుతుంది తన దగర కేవలం 4 రోజులు మాత్రమే టైం ఉంది హంతకుడిని పట్టుకోవడానికి, మరోపక్క తల్లితండ్రులు కి దేశం మొతం మద్దతు పెరుగుతుంది, ప్రభుత్వం మీద వత్తిడి పెరుగుతుంది కోర్ట్ కూడా జ్యోక్యం చేసుకుంటుంది, ఇంకో పక్క రిపోర్ట్ కి కొత్త విషయాలు తెలుస్తాయి, చివరికి కేసు లో అసలు హంతకులు ఎవరో కాదు తలితండ్రులు అని తెలుసుంది కానీ చివరి నిమిషం వరకు అందరిని మోసం చేస్తారు, అందరిని ఫూల్స్ ని చేస్తారు ... అసలు రిపోర్టర్ ఎలా కనిపెడుతాడు అనేదే కదా లో కీలకం, కేవలం 4 రోజులో అతను పడే శ్రమ ఒక వైపే ఐతే ప్రజలను మీడియాను పోలీసులను దేశాన్ని ఫూల్స్ చేస్తున్న తలితండ్రులు చంపారు అని చెప్పడానికి అతను పడే శ్రమ కథను మలుపు తిప్పుతుంది ..... మరో వైపు తల్లితండ్రులు కూడా ఎవరికీ అనుమానం రాకుండా అందరిముందు వాళ్ళు బాధపడే తీరు తపించుకునే ప్రయత్నం కూడా బాగుంటుంది ... ఆశలు ఎలా చంపుతారు ఎందుకు చంపుతారు ?

Written By

శరత్ చంద్ర ఎస్ వి ఎన్